News

నేతన్నలకు నేరుగా సబ్సిడీ


చేనేత కార్మికులకు అందించే ప్రభుత్వ సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఆధార్, బయోమెట్రిక్ ఆధారంగా ఇందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత, జౌళి శాఖపై మంత్రి బుధవారం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడు లేనివిధంగా నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కనీవినీ ఎరుగని రీతిలో బడ్జెట్ కేటాయించామని మంత్రి తెలిపారు. రూ.1200కోట్లు కేటాయించడం చరిత్రలోనే కీలక పరిణామమన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్న నేపథ్యంలో నిధుల కేటాయింపుల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని కోరారు